లంచం తీసుకోవడం తప్పుకాదన్న రాజన్న...

January 08, 2015 | 02:46 PM | 36 Views
ప్రింట్ కామెంట్

స్వతహాగా డాక్టర్ అయిన తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజ య్య వైద్యుల పట్ల తనకున్న పక్షపాతాన్ని చాటుకున్నారు. మ్యాటరేంటంటే... ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మంచిర్యాల ఏరి యా ఆస్పత్రిలో రాత్రి బస చేసిన ఆయన పరోక్షంగా వైద్యులకు మద్దతు తెలిపారు. బుధవారం ఆస్పత్రి నుంచి వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడుతూ, ఆస్పత్రిలో సిబ్బంది రూ.100, రూ.200 అడిగితే అది తప్పు కాదని, అలా అడిగినవారిని అవినీతిపరులుగా పరిగణించొద్దని చెప్పుకొచ్చారు. ఎవరైనా వేధిస్తేనే ఆర్డీవో, డీఎంహెచ్‌వో, కలెక్టర్‌కు ఫోన్లో సమాచారమివ్వాలని సూచించారు. స్వైన్‌ఫ్లూ బాధిత రోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓ ఐసోలేటెడ్ వార్డుతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘థర్మోస్కాన్’ను ఏర్పా టు చేసినట్లు వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి రాజయ్య చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ