పేరు కన్ఫ్యూజన్లో క్లారిటీ ఇచ్చేస్తున్నారు

November 21, 2014 | 12:47 PM | 37 Views
ప్రింట్ కామెంట్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు విషయంలో కొనసాగుతున్న గజిబిజికి తెరదింపేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎయిర్ పోర్ట్ పేరు రాజీవ్ గాంధీ గానే కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీడియాతో తెలిపారు. ఎయిర్ పోర్ట్ లో అంతర్జాతీయ, డొమెస్టిక్ (దేశీయ) టెర్మినల్ ఉంటాయని, అయితే కేంద్ర ప్రభుత్వం పేరు మార్చాలని నిర్ణయించింది కేవలం డొమెస్టిక్ టెర్మినల్ కు మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు. దానికి స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసకుందని తెలిపారు. హైదరాబాద్ లో నూతనంగా మరో విమానాశ్రయం నిర్మించి తెలంగాణ ప్రభుత్వం ఏ పేరు పెట్టినా టీడీపీ కి అభ్యంతరం లేదని సండ్ర వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల నేతలు ఈ విషయంలో రాద్ధాంతం చేయోద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ విషయంపై సీఎం కేసీఆర్ మౌనంగా ఉండటం తెలంగాణ నేతలకు మింగుడుపడటం లేదట. తెలంగాణలోని ఎయిర్ పోర్ట్ టెర్మినల్ కు ఒక ఆంధ్ర నాయకుడి పేరు పెట్టడం ఏంటని వీహెచ్ లాంటి నేతలు ఫైరవుతున్నారు. తాజా వార్త ప్రకారం అసెంబ్లీలో కేసీఆర్ ఈ విషయమై నోరు మెదిపారట. పీవీ, రావినారాయణరెడ్డి లాంటి తెలంగాణ నేతలు ఉండగా, పోయి పోయి ఒక ఆంధ్ర నేత పేరు పెట్టడం ఏంటంని, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పేరే కొనసాగిన ఫర్వాలేదంటూ ప్రసంగించారట. దీనికి కాంగ్రెస్ నేతలు కూడా మద్ధతు తెలిపినట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ