రిటైర్మెంట్ పెంపుకి టీ సర్కార్ నో

November 20, 2014 | 05:37 PM | 26 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చాలా గొప్పదని, తమ ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటుందని కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. అలాంటి ‘ఫ్రెండ్లీ సర్కార్’ ఇప్పుడు పదవీ విరమణ వయస్సు పెంపుపై కాస్తా కఠిన వైఖరినే అవలంభిస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60ఏళ్లకి పెంచిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో కూడా వయోపరిమితి పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ... దీనికి మేం ఒప్పుకోం. ఏటా 5 నుంచి 10 వేల మంది నిరుద్యోగ యువకులు ఈ విధానంతో ఉపాధి అవకాశాలు కోల్పోతారని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల విభజన పూర్తయిన తర్వాత రాష్ర్టంలో 1.07 లక్షల పోస్టులకు నొటిఫికేషన్లు జారీచేస్తామని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ