తెలివైన ఎలుగుబంటి ఎలా తప్పించుకుందో తెలుసా?

April 19, 2016 | 12:14 PM | 1 Views
ప్రింట్ కామెంట్
wild-bear-dig-escape-nehru-zoo-niharonline

ఓ ఎలుగుబంటి జూ ఎన్ క్లోజర్ లో ఉండి, ఉండి బోర్ కొట్టినట్లు ఉంది. గోల గోల చేసింది. చివరికి బయటపడేందుకు  ఓ ఐడియా వేసింది. దాన్ని అమలు చేసి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. పాత సినిమాలో హీరోలు, విలన్ లు జైలు నుంచి తప్పించుకునేందుకు గోతులు తవ్వి బయటపడటం మనం చూసిందే. సేమ్ అలాగే తానుండాల్సిన బోను నుంచి బయటకు ఓ కలుగు తవ్వి మరీ తప్పించుకుంది. అంతేనా ఏకంగా ఓ ఎత్తయిన గోడ ఎక్కి హల్ చల్ చేసింది. దూకడానికి భయపడి అటూ ఇటూ తిరగటం గమనించిన స్థానికులు జూ అధికారులకు సమాచారం అందించారు. ఇక దానిని పట్టుకునేందుకు అధికారులు  రాత్రంతా శ్రమించారు. చివరికి ట్రాంక్విలైజర్ల ద్వారా మత్తుమందు ఇచ్చి పట్టేసుకున్నారు. ఎన్ క్లోజర్ నుంచి బయటకు వచ్చేందుకు గుంత తవ్వాలన్న ఆలోచన ఓ క్రూర జంతువుకు రావడం మరీ దారుణం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అన్నట్లు ఇది జరిగింది ఎక్కడో కాదు... మన హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లోనే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ