తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఊసెత్తిత్తే అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ రేంజ్ లో విరుచుకుపడుతుందో జగమంతటికి తెలుసూ... అలాంటిది ఓ టీఆర్ఎస్ నేత రేవంత్ రెడ్డిని పొగిడితే ఎలా ఉంటుంది. నోరు వెళ్లపెట్టడం మీ వంతు కూడా అయ్యిందా. పొగిడింది ఎవరో కాదు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఆయన మాటల్లో ‘‘రేవంత్ రెడ్డి చాలా తెలివైన వాడు. మంచి నేత. కానీ, ఏ రైట్ మ్యాన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ’’ అని నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. అయితే మంత్రులైన హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ లను రేవంత్ విమర్శించడాన్ని మాత్రం ఆయన తప్పుబట్టారు. ఎంతయినా అసలు ఆయనంటే పడని టీఆర్ఎస్ నుంచే రేవంత్ రెడ్డికి ప్రశంసలు దక్కడం నిజంగా వండరే కదా.