దేవుళ్లపైనే వరాలు కురిపిస్తున్న సీఎం సారూ

January 31, 2015 | 12:41 PM | 56 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కి భగవంతుడి మీద ఎంత నమ్మకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాష్ట్ర కల సాకారం కోసం ఉద్యమ సమయంలో ఆయన చేసిన మొక్కులను ఇప్పుడు వరుసబెట్టి తీర్చుకుంటుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా కొన్ని పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వం వంతుగా కొన్ని కోట్లను విరాళాలుగా ప్రకటించేశాడు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారికి బంగారు నగల కోసం రూ.5 కోట్లను ఇస్తున్నట్లు చెప్పారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారితోపాటు, తిరుచునూరు పద్మావతి అమ్మవారికి పసిడి ముక్కుపుడకలను అందజేయనున్నట్లు తెలిపారు. అజ్మీర్ దర్గా వద్ద తెలంగాణ యాత్రికుల కోసం రూ.5 కోట్లతో వసతి గ్రుహం నిర్మించటంతోపాటు రూ.2.5 లక్షలు విలువ చేసే దుపట్లను అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, కురువి వీరభద్రస్వామికి బంగారు మీసాలు చేయిస్తున్నట్లు చెప్పారు. మొక్కులు తీర్చుకోవటంలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు ఆయన మీడియాతో ఓపెన్ గా చెప్పటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ