డప్పుకొట్టి... డాన్స్ చేసిన బాబు

March 04, 2015 | 05:20 PM | 63 Views
ప్రింట్ కామెంట్
chandrababu_holi_festival_niharonline

తెలుగు దేశం పార్టీ నేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ఒకప్పుడు నవ్వంటే ఏమిటో తెలియనట్టుగా ఉండేవారు, పలకరింపులు, కలివిడితనం కాస్త తక్కువగానే ఉండేవి. కానీ ఇటీవల కాలంలో ముఖంలో నవ్వులు పూయిస్తున్నారు. ప్రజలతో కలిసి పండుగలు చేసుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో చూడండి డప్పు పట్టుకొని రెండు రోజులకు ముందే హోళీ పండుగ వేడుకల్ని కార్యకర్తలు, ప్రజల మధ్య జరుపుకుంటున్నారు. బుధవారం హైదరాబాద్ లో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నయుడు ఇంటి వద్ద ఈ పండుగను జరుపుకున్నారు. ఈ సంబరాల్లో ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో బంజారాలు న్రుత్యాలతో, పాటలతో పెద్ద ఎత్తున పండుగ చేశారు. వారందరితో డప్పు కొడుతూ ఎపీ సీఎం కూడా డాన్స్ చేయడంతో పార్టీ నాయకుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. తెలుగుదేశం నాయకులంతా కలిసి కట్టుగా చిందులేసి హోళీ సంబరాలు జరుపుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ