ఈ ఉగాదికైనా మెట్రో రైలు ఎక్కేద్దామని ఎదురు చూస్తున్నారు సిటీ ప్రజలు కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల మెట్రో రైలు ఉగాదికి కూడా పట్టాలు ఎక్కడం లేదంటున్నారు అధికారులు. అయితే ఈ వాయిదా ఎందుకంటే ఇటీవల ఒక సర్వేనే కారణమంటున్నారు. నాగోల్ నుంచి మెట్టు గుడా వరకు మాత్రమే రెడీ అయిన మెట్రో రైలు ఆ దూరం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదంటున్నారు. పైగా నష్టాలు కూడా తప్పవంట. ఈ కొద్ది దూరానికి పనిగట్టుకొని మెట్రో ఎక్కాల్సిన అవసరం ఎవరికీ లేదు. పైగా ఈ కాస్త దూరం వెళ్ళి మళ్ళీ ఇంకో వాహనాన్ని పట్టుకొని గమ్య స్థానం చేరాలి. ఈ దూరంలో ఆర్టీసి బస్సులు కోకొల్లలు మెట్రో రైల్ ఎక్కాలంటే మియాపూర్, అమీర్ పేట, బేగం పేట వంటి ప్రదేశాలకు చాలా సమయం కలిసి వస్తుంది. అందుకే ఈ మార్గాల్ని పూర్తి చేస్తేనే మెట్రో రైలు ఎక్కేవారి సంఖ్య బాగా పెరుగుతుంది. అందుకే ఈ ఏడాదిలోనైనా ఈ మార్గాల్ని పూర్తి చేస్తేనే మెట్రో పట్టాలు ఎక్కే అవకాశాలున్నాయి.