భాగ్యనగరంలో ‘కుక్క’ బతుకు

April 04, 2015 | 04:58 PM | 117 Views
ప్రింట్ కామెంట్
dogs_at_hyderabad_gandhi_hospital_niharonline

మన కర్మ భూమిలో పుట్టకి చెట్టుకి, నీటికి నిప్పుకి, జంతుజాలానికి ఏదో రూపేగా పౌరాణిక ప్రాశస్త్యం కల్పించి ముక్కొటి దేవతల కార్యకలపాలకి ముడిపెట్టి వ్యవహారించడం పరిపాటి. ఇటువంటి సందర్భంలో ‘కుక్క’ అని మనం తక్కువ చేసి న్యూనతగా వ్యవహారించే గ్రామసింహాం ప్రస్తావన మనకు అడుగడుగునా తారసపడుతూనే ఉంటుంది. కుక్క అంటే శునకం అంటే కాలభైరవుడు పేరుతో గుడి కూడవెలసి పూజలందుకోవడం జరుగుతున్నది నిజం.

ఇటువంటి పూజనీయ, విశ్వసనీయ జీవికి ప్రస్తుతం భాగ్యనగరంలో అందరి ఆగ్రహానికి గురవుతూ, మున్సిపాలిటీ వారి ‘వల’పులకు చిక్కి ఛీ అనిపించుకునే దౌర్భాగ్యస్థితి దాపురించింది. పసిపిల్లల మీద దాడిచేయటం,ఆస్పత్రి ప్రాంగణంలో రోగులపై దాడి చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడితే అమల వచ్చి అడ్డుపడినా బడితె పూజ తప్పదు. క్షమించాలి కుక్కలకు! ముఖ్యంగా ఎండకాలం శునకరావులకి తిక్క రేగి లోకమంతా అసెంబ్లీలా గొచరిస్తుందనే విశ్లేషణ తెరపైకి వచ్చింది. పిచ్చివాటికి స్వేదగ్రంథులు కొరవడినందున చెమటకక్కడానికి వేరే మార్గం లేక హింసామార్గాన్ని అనుసరిస్తాయంటున్నారు విజ్ఝులు. ఏదో నాలుగు రోట్టె ముక్కలు దొరుకుతాయనే ఆశతో ఆస్పత్రి దగ్గర తచ్ఛాడటం తప్పులేదు. ప్రమాదం బారిన పడి కాలు, చెయ్యి విరిగిన ఫేషంట్లపై దాడిచేయడం క్షమార్హం కాదు... కానేరదు. ఆ దాడి చేసేది వైద్యం నిర్లక్ష్యం చేసిన అధికారుల మీద అయితే యావన్మందీ హర్షిస్తారేమో తెల్వదు. కాలనీలో కుక్కలు గుంపులు గుంపులుగా   తిరుగుతూ దేశ క్షేమం గురించి దీర్ఘంగా చర్చించే సీన్లు చూడటానికి ముచ్చట కలుపుతుంటాయి. తోక ఊపుకుంటూ ఓటు కావాలి అనే రీతిలో మనల్ని ఆశ్రయిస్తే పక్కనే ఉన్న పాన్ డబ్బాలో బిస్కెటు పోట్లాం కొని వాటికివ్వడానికి అభ్యంతరం ఏమాత్రం లేదు. కుక్కలో ఉన్న దుర్మార్గపు కుక్కలకి బ్లూక్రాస్ వారు కౌన్సిలింగ్ చేపట్టగలరు. ఇంతకీ కుక్క సాధు జంతు కాదా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ