క్యాబ్ డ్రైవర్ కక్కుర్తి... ఐటీ యువతి వీడియో తీస్తూ పట్టుబడ్డాడు

January 21, 2015 | 04:41 PM | 38 Views
ప్రింట్ కామెంట్

షి టీం అప్రమత్తతో ఓ క్యాబ్ డ్రైవర్ చెత్త బుద్ధి బయటపడింది. ఓ చేత్తో కారు నడుపుతునే మరో చేత్తో నిద్రిస్తున్న ఉన్న యువతిని వీడియో తీసిన ఆ క్యాబ్ డ్రైవర్‌ను షీ బృందం అరెస్టు చేసింది. ఏడెనిమిది నిమిషాల పాటు వీడియో తీయడమే కాకుండా నాలుగైదు ఫోటోలను కూడా అతను తీశాడు. మాదాపూర్ సైబర్ టవర్స్ సమీపంలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగిని రోజులాగే సంస్థకు చెందిన క్యాబ్‌లో ఉదయం ఇంటికి బయలుదేరింది. కారులో ఎక్కిన ఆమె డ్రైవర్ అబ్దుల్ రషీద్ పక్క సీటులో కూర్చోని నిద్రమత్తులోకి జారుకుంది. ఆ సమయంలో డ్రైవర్ ఆమెను వీడియో తీయడం ప్రారంభించాడు. క్యాబ్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటి కూడలికి చేరుకోగానే షీ బృందం... డ్రైవర్ కదలికలను గమనించింది. అంతే వారు అతనిని దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెంబడించారు. క్యాబ్‌ను ఆపి డ్రైవర్ వద్ద గల సెల్ ఫోన్‌ను తనిఖీ చేయగా నిర్వాకం బయటపడింది. దీంతో రషీద్ పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ