తమ పని తాము చేసుకుపోతున్న ఆకతాయిల వేధింపులు అమ్మాయిలకు తప్పటం లేదు. ఎక్కడ కనిపించినా చాలు వెంటపడి వేధిస్తూంటే పరువు పోతుందన్న భయంతో, అనవసరంగా ఎందుకు రచ్చ చెయ్యటమన్న ఆలోచనతో చాలా మంది వారిని లైట్ తీస్కుంటున్నారు. ఆ ఆలోచననే ఆసరా గా తీసుకుని రెచ్చిపోతున్నారు పోకిరీలు. అయితే అవి శృతి మించితే... అప్పుడు పరిస్థితి ఏంటి? అలాంటి వాటికి సమాధానం చెప్పింది ఓ యువతి ఇక్కడ. అది కూడా సాదాసీదాది కాదు... చెప్పు చేత పట్టి మరీ చెప్పింది.
హైదరాబాదు శివారు ప్రాతం పటాన్ చెరులో ఈ ఘటన జరిగింది. శ్రీరాంనగర్ లో స్థానికంగా ఉండే ఓ యువకుడు ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడు. నిత్యం అతడి వేధింపులతో చిర్రెత్తుకొచ్చిన ఓ యువతి సహనం కోల్పోయింది. ఉన్నపళంలో కాలికున్న చెప్పు తీసి మహిళ దాడి దిగింది. అసలేం జరుగుతుందని బిత్తరపోయిన ఆ ఆకతాయి ముఖంపై చెప్పు దెబ్బలు పడకుండా కాపాడుకోవడానికి యత్నించడం మినహా ఇంకేమీ చేయలేకపోయాడు. చెప్పు చేతి నుంచి జారేదాకా ఆకతాయిని చితక్కొట్టిన ఆ మహిళ, ఇంకా కోపం చల్లారక పిడిగుద్దులతో అతడి వీపును విమానం మోత మోగించింది.
తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిల తాట తీస్తున్న మహిళల సంఖ్య ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. వేధింపులను మౌనంగానే ఎందుకు భరించాలన్న వారి ఆలోచనే ఇలా దైర్యం చేసి ముందుకు వచ్చి పోరాడేలా చేస్తుంది.