నవంబర్ నుంచి ప్రత్యేక పద్ధతిలో ప్రత్యేకమైన మెటీరియల్ తో తయారుచేసిన రేషన్ కార్డులు తెలంగాణ పౌరులకు అందబోతున్నాయి. ప్రజల జీవితాలు క్షణభంగురమని అందరికీ తెల్సిన సత్యం. వారికిలేని గ్యారంటీ గల సదరు రేషన్ కార్డులు చిరంజీవులు.. చింపితే చిరగవు, కాలిస్తే కాలవు, గంగలో ముంచినా తడవవు. అదే ఆ కార్డు యజమానుల శరీరాలు నరికితే చిరుగుతాయి, కాల్చేస్తే కాలిపోతాయి, బుడంగున ముంచితే తడిసి ముద్దయి జలుబుచేస్తాయి.
గీతాచార్యుడు బోధించగా ఘంటసాల మాస్టారు గానం చేసిన గీతోపదేశం ప్రతి చావు పందిట్లోనూ ప్రతిధ్వనిస్తూ ఉంటది. అర్జునా ఆత్మ శాశ్వతమైనది చిరగదు, కాలదు, తడవదు అనే కాన్సెప్ట్ మీద పరిశోధించి తయారు చేసిన ఈ రేషన్ కార్డులు వర్థిల్లుగాక!