కల్లుపై కొట్టేసింది... ఆత్మహత్యలపై ఆరా తీసింది

December 22, 2014 | 03:39 PM | 22 Views
ప్రింట్ కామెంట్

రాష్ట్రంలో కల్లు దుకాణాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. దుకాణాల ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని, దీనిపై జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణలో రైతుల ఆత్మహ్యతలపై దాఖలైన పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసింది. సెలబ్రిటీలకు డబ్బులు ఇస్తున్నారు, వినోదంపై ఖర్చు పెడుతున్నారు, అదే అన్నదాతలు ఆపదలో ఉంటే ఆదుకోలేరా...? అని టీ.ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. రైతులు ఆత్మహ్యత్యలకు పాల్పడకుండా సమగ్ర విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లోగా పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. కాగా, గతంలో దాఖలైన ఇలాంటి పిటిషన్ పై ఇప్పటికే కౌంటర్ వేశామని ప్రభుత్వ లాయర్ చెప్పగా, రెండు పిటిషన్లు ఒకసారి విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ