సెటప్ బాక్స్ లకు మరో రెండు నెలలు

December 30, 2015 | 12:18 PM | 3 Views
ప్రింట్ కామెంట్
telugu-states-high-court-extended-set-up-boxes-niharonline

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31వ తేదీ లోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్‌వోలు అందరూ తమ తమ పరిధిలో వినియోగదారులందరికి సెటప్‌ బాక్సులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డిజిటలైజేషన్ లో భాగంగా  నాణ్యమైన ప్రసారాలను ప్రేక్షకులకు అందించాల్సిందేనని కేంద్రం ఉద్దేశం. వాటి ఏర్పాటుకు గురువారంతో గడువు ముగుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల ఎంఎస్ వోలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేబుల్ సెట్ టాప్ బాక్సులు అమర్చుకునేందుకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు గడువు పొడిగించింది. కేంద్రం సరిపడా సెట్ టాప్ బాక్సులు సరఫరా చేయలేదని, ఈ నేపథ్యంలో గడువు పెంచాలని కోర్టును కోరారు. విచారించిన కోర్టు వారి విజ్ఞప్తిని మన్నించింది. కేబుల్ టీవి డిజిటలైజేషన్ లో భాగంగా సెట్ టాప్ బాక్సుల ఏర్పాటు చేసుకునేందుకు రెండు నెలల గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ