గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. మంగళవారం పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కార్మిక సంఘాలపై ధ్వజమెత్తింది. సామాన్యుల జీవితాలతో ఆడుకుంది చాలని, దీని ద్వారా ఆర్టీసీ కూడా చాలా నష్టపోయిందని తెలిపింది. సమ్మెతో సాధారణ జనాలు పడ్డ కష్టాలు తాను కళ్లారా చూశానని ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలపటం విశేషం. సమ్మె ద్వారా సంస్థ తీవ్రంగా నష్టపోవటమేగాక, ప్రైవేట్ దందాలు ప్రజల్ని పీడించుకు తిన్నాయని బెంచ్ వ్యాఖ్యానించింది. ముందుగా ఈ రోజు మధ్యాహ్నాం వరకు డెడ్ లైన్ విధించిన హైకోర్టు. కార్మిక సంఘాలు రెండు రోజులు గడువు కోరగా తిరస్కరించింది. రేపు ఉదయం 10.30 కల్లా సమ్మె విరమించాలని ఆదేశించి విచారణను బుధవారంకు వాయిదా వేసింది. హైకోర్టు మొట్టికాయలతోనైనా వారు దిగివస్తే సామాన్యీకానికి అంతకన్నా ఆనందమేముంది.