ఫిరాయింపుల పంచాయితీ కోర్టుకు చేరింది

January 21, 2015 | 05:30 PM | 21 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ రాష్ట్రంలో గులాబీ బాస్ ఆకర్ష్ కి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుదేలైపోతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి మరికొంత మంది ఎమ్మెల్యేలు కారెక్కెందుకు సిద్ధమవుతున్నారని ఏకంగా ముఖ్యమంత్రే ప్రకటించడం వెనుక ఆకర్ష్ ఏ మేర పనిచేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ప్రయత్నంలో ఎక్కువగా బలైంది మాత్రం టీడీపీయే. సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ కు మొరపెట్టుకున్న స్పందించకపోవటంతో ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో నేత రేవంత్ రెడ్డిలు ఫిరాయింపులపై హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని, ధర్మారెడ్డి, తీగల టీఆర్ఎస్ లోకి వెళ్లటం చట్ట విరుద్ధమని వారు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 27లోగా వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. వీరితోపాటు కాంగ్రెస్ సభ్యుల వ్యవహారంపై కూడా అదే గడువులోగా వివరణ ఇవ్వాలని చెప్పింది. మరీ ఈ జంపింగ్ బాబుల పరిస్థితి ఏంటో ఆ రోజు తేలబోతుందా? చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ