గత ‘ఉదయం’ పత్రిక వైభవ ‘వర్తమాన’ ప్రతీకలైన పాశం యాదగిరి, మాడభూషి శ్రీధర్ లు పాల్గొన్న హైదరాబాద్ జిందాబాద్ సభలో జస్టిస్ చంద్ర కుమార్ ను అధ్యక్షునిగా, ప్రతినిధులుగా పాశం, మాడభూషి ప్రభృతులుగా ఎన్నుకొంది. చపలచిత్తంలో పని చేసే ప్రకటనల వల్ల తుగ్లక్ మళ్లీ అవతరించాడని ప్రజలు భ్రమించగలరని జస్టిస్ చంద్రకుమార్ హితవు పలికేరు. కేంద్ర సమాచార కమిషన్ మాడభూషి శ్రీధర్ ప్రసంగిస్తూ శాసన, కార్య నిర్వాహక, న్యాయవ్యవస్థలు కీలకమైనవిగా ఉంటూ ఫోర్త్ ఎస్టేట్ గా మన్నింపబడుతున్న ముఖ్యాంగం సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతోంది. అయినా ఇవన్నీ రియల్ ఎస్టేటు మాయలో పడిపోయినందున, అక్రమాన్ని నిలదీసే ఐదవ ఎస్టేటుగా పౌరసమాజం అంకురించాలని దాని రూపాంతరమే హైదరాబాద్ జిందాబాద్ ఆవిర్భావమని మాడభూషి ప్రకటన హర్షణీయం.
మూడు దశాబ్ధాల క్రితం ఉదయించిన దిన పత్రిక దాసరి ఉదయంలో బ్యూరో ఛీఫ్ గా రాణించిన పాశం యాదగిరి తదనంతర కాలంలో వర్తమానం అనే దినపత్రిక నడపటం, మాడభూషి కూడా ఉదయం పత్రికలో పనిచేయడం యాదృచ్ఛికం. వీరిరువురూ హైద్రాబాద్ జిందాబాద్ సంస్థకు రూపకర్తలు కావడం యాధృచ్ఛికం కాదని అనుకుందాం!