ముదురు మహమ్మారి డాక్టర్లను వదలట్లేదు

January 29, 2015 | 04:43 PM | 75 Views
ప్రింట్ కామెంట్

స్వైన్ ఫ్లూ ధాటికి భాగ్యనగరం బెంబేలెత్తి పోతుంది. ఎన్ని చర్యలు తీసుకుంటన్నప్పటికీ వాతావరణంలోని మార్పులతో త్వరగా పాకిపోతుంది. ఎంతలా అంటే తాజాగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో 12 మంది జూనియర్ డాక్టర్లు స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నట్లు బయటపడింది. దీంతో అధికారులు వారికి విధుల నుంచి మినహాయింపునిచ్చారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని వారికి సూచించారు. మరోవైపు ఈ మహ్మమారి ధాటికి గురువారం ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారిసంఖ్య 29 కి (అధికారికంగా) చేరింది. ప్రస్తుతం గాంధీలో 43 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 10 మంది చిన్నారులున్నారు. కాగా దేశం మొత్తం మీద ఈ నెలలో ఇప్పటి వరకు 60 మంది స్వైన్ ఫ్లూ బారిన పడి మరణించారని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ