స్వైన్ ఫ్లూ విజ్రంభణ పై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గానే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై సంబంధిత మంత్రి, అధికారులపై ఆయన గరం అయ్యారనే వార్తలు వినవస్తున్నాయి. తాజాగా టీ ప్రభుత్వం వ్యాధి తీవ్రను, విస్తరిస్తున్న తీరును పసిగట్టడంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారంటూ ఆరోగ్యశాఖ సంచాలకుడు సాంబశివరావును విధుల నుంచి తప్పించింది. ఈ మేరకు సీఎం కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వేటు తక్షణమే అమలులోకి వస్తుందని అందులో పేర్కొంది. మరోవైపు వైద్య మంత్రి రాజయ్యపై కూడా వేటు పడబోతుందనే ఊహాగానాలు వినవస్తున్నాయి. ఈ మహమ్మారి ధాటికి జనాలు పిట్టల్లా రాలుతుంటే అధికారులు పట్టించుకోకపోవటంతో కేసీఆర్ ఈ రేంజ్ లో స్పందిస్తున్నారట. ఇఫ్పటికే కేంద్ర సాయం కోరిన కేసీఆర్ ఇఫ్పటికైనా అధికారులను అప్రమత్తంగా ఉండాలని, తగిన వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు.