సనత్ నగర్ ఉప ఎన్నికల్లో తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి చేపట్టడం తెలిసిన విషయమే. అనంతరం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఇఫ్పుడు మళ్లీ ఎన్నికలకు ఆయన సిద్ధమయ్యాడు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే వచ్చి తనపై పోటీకి దిగినా తన గెలుపును అడ్డుకోలేడని అంటున్నాడాయన. పార్టీ మారిన అనంతరం చంద్రబాబు తలసానిపై విమర్శలు చేయగా, తాను టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నానని, చంద్రబాబులా మధ్యలో వచ్చి చేరలేదని తలసాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ లో మంచిపట్టున్న తలసానికి సీఎం కేసీఆర్ సినిమాటోగ్రఫీ శాఖతోపాటు కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను అప్పగించిన విషయం తెలిసిందే. మరీ చంద్రబాబు పెద్దకొడుకుతో సమానం అన్న తలసాని తల్లి లలితాబాయి ఈ మాటలు విని ఎంతగా ఫీలవుతుందో.