గ్రేటర్ కోసం ‘మాస్టర్’ ప్లాన్

December 17, 2014 | 11:50 AM | 23 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి మరోసారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని మంత్రి వర్గ విస్తరణలో జంట నగరాల నేతలకు మంత్రిపదవులు కేటాయించారు. మొదట విడత ప్రమాణ స్వీకారంలోనే జంటనగరాల కోటా ఎమ్మెల్సీలైన నాయిని నర్సింహరెడ్డి కి కీలకమైన హోంశాఖ, మహ్మద్ ఆలీకి డిప్యూటీ సీఎంతోపాటు రెవెన్యూశాఖలను, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ లకు ఎక్సైజ్ శాఖను అప్పగించారు. తాజా విస్తరణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. తద్వారా నలుగురు గ్రేటర్ నేతలకు మంత్రి పదవులు కేటాయించిన రికార్డు సాధించిన ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రేటర్ నుంచి దానం, ముఖేష్ గౌడ్, శంకర్రావులు మంత్రి పదవులు నిర్వహించారు. ఉద్యమ సమయం నుంచే గ్రేటర్ లో పార్టీ కి అంతత మాత్రమే పట్టు ఉందన్న అపవాదును క్రమేపీ తొలగిస్తూ గ్రేటర్ ఎన్నికల వరకు బలోపేతం చేయాలనే మాస్టర్ గారి ప్లాన్ వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది. మరి ఈ పర్యవసనాలు ఎన్నికల్లో ఏ రిజల్ట్ ని ఇస్తాయో చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ