చరిత్ర పుటల్లోనే కాదు... ఇక పుస్తకాల్లో కూడా

January 23, 2015 | 02:28 PM | 38 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వీయ రాష్ట్ర సాధనకై నాలుగేళ్ల క్రితం చేసిన ఆమరణ దీక్షను త్వరలో పుస్తకాలలో చూడబోతున్నాం. దీంతోపాటు డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటనను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ అకాల మరణం తర్వాత ఉద్యమాన్ని ఉధ్రుతం చేసి కేసీఆర్ 11 రోజులపాటు నిరాహార దీక్షచేసి, కేంద్రం నుంచి తెలంగాణకు సానుకూల ప్రకటనను రాబట్టుకున్నారు. ఆ దెబ్బతో అటు కేసీఆర్ తోపాటు డిసెంబర్ 9 ప్రకటన చరిత్ర పుటలకెక్కింది. తాజాగా ఈ రెండు ఘట్టాలకు పాఠ్యాంశాలుగా స్థానం కల్పించేందుకు తెలంగాణ సిలబస్ రివ్యూ కమిటీ తీర్మానించింది. 1956 నుంచి సాగిన ఉద్యమంలో పలు ఘట్టాలను పాఠ్యాంశాలుగా చేయాలని తీర్మానించిన ప్రభుత్వం ఈ రెండు ఘట్టాలకు మరింత ప్రాధాన్యమివ్వాలని తలపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ