అవునండీ నిజమే. ప్రతిపక్షాల కన్నా ఎక్కువగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడే టీ సీఎం కె.చంధ్రశేఖర్ రావు, మొదటిసారి ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. రాజధాని విషయంలో చంద్రబాబు తీసుకుంది నూటికి నూరుపాళ్లు సరైన నిర్ణయమని కేసీఆర్ అన్నారు. రిపబ్లిక్ డే సందర్బంగా రాజ్ భవన్ లో గవర్నర్ ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి ఈ ఇద్దరు తెలుగు సీఎంలు హాజరయ్యారు. ఉన్నట్టుండీ సడన్ గా మీడియా సాక్షిగా కేసీఆర్ బాబును పొగడటం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా తుళ్లూరు ను ఎంపిక చేసుకొవటం ద్వారా చంద్రబాబు సరైన పనిచేశారు. నది తీరంలో రాజధానిని ఎంపిక చేసుకోవటం, పైగా రాజధాని ఉత్తర ముఖం నదికి ఎదురుగా ఉండటం వాస్తుపరంగా వందకు వంద శాతం కరెక్టయిన పని. అభివ్రుధ్ది విషయంలో రాజధానికి ఎటువంటి ఢోకా ఉండబోదు. ఈ విషయంలో చంద్రబాబును నేను అభినందిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అంటేనే చిటపటలాడే కేసీఆర్ ఇలా పొగడటంతో అక్కడే ఉన్న ఏపీ మంత్రులతోపాటు, ఉన్నతాధికారులు కూడా సంతోషం వ్యక్తంచేశారట.