గుడ్డు కోసం గుస్సా అయిన గవర్నర్!!

August 24, 2015 | 02:04 PM | 2 Views
ప్రింట్ కామెంట్
govenor_narasimhan_serious_on_egg_issue_in_mahaboobnagar_niharonline

తన గురించి  ఎలాంటి కామెంట్లు వచ్చినా అస్సలు పట్టించుకొని వ్యక్తి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. పాలనా పరంగా ఏమైనా సమస్యలు తన దృష్టికి వస్తే మాత్రం అస్సలు భరించలేరు. ఆ మధ్య టీటీడీ పాలనావ్యవహారాల్లో ప్రైవేయిట్ జోక్యం పై తెలుసుకున్న ఆయన స్వయానా కలగజేసుకుని సమస్య పరిష్కారం చేశారు. అలాంటి గవర్నరేంటి? గుడ్డు కోసం గుస్సా అవడం ఏంటీ ? అనుకుంటున్నారా...  కంగారు పడకండీ అక్కడికే వస్తున్నా...

                              పాలమూరు జిల్లా కిషన్ బాగ్ లో గ్రామ జ్యోతి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ సహా మంత్రులు కేటీఆర్, జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలలు, కూలీలతో నరసింహన్ సంభాషించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న విద్యార్థుల హాస్టల్ ను పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థులతో సంభాషిస్తూ కొడిగుడ్డు వారానికి ఎన్నిసార్లు పెడుతున్నారని అడిగారట. దానికి విద్యార్థులు వారానికి ఒక్కరోజు మాత్రమే అనడంతో నరసింహన్ ఆగ్రహంతో ఊగిపోయారుట. నిజానికి వారానికి రెండుసార్లు ఇవ్వాల్సిందయితే ఒక్కసారి ఇవ్వడమేంటని అధికారులపై ఆగ్రహాం వ్యక్తంచేశారట. ఇక ఈ పద్ధతి ఒక్క ఈ హస్టల్ లోనేనా లేక జిల్లా మొత్తం ఈ పరిస్థితేనా అని ఆరాతీయాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించారట. ఇదండీ గవర్నర్ గారి గుడ్డు కహానీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ