ప్రపంచ తాగుబోతుల్లారా... ఏకంకండీ

August 08, 2015 | 03:33 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Drunk_Driving_in_telangana_niharonline

భాగ్యనగరం సాక్షిగా... నగరంలో గుళ్లూ గోపురాలు, కబేళాలు, శాఖాహార శాలలూ, తాగుడు మాన్పించే వైద్య ఆలయాలు... వీటన్నింటితోబాటు వైన్ షాపులు, పర్మిటు రూంలు, బార్లు  ఇలాంటివి కోకొల్లలు. త్రాగి నడుచుకుంటూ ఇంటికి పోతే నో ప్రోబ్లం, బస్సెక్కిపోతే నో ప్రోబ్లం, స్వంతకారుకి త్రాగని డ్రయివర్ గల మహరాజులకి నో ప్రోబ్లం, టూవీలర్సున్న అలగా జనం డ్రయివరుని పెట్టుకోగలిగితే నో ప్రోబ్రమ్... మరి ప్రోబ్లం ఎక్కడుంది. నీ తాగుడు నువ్వు త్రాగి నీ బండి నడుపుకుంటేనే అసలు ప్రోబ్లం. అలాంటి టైంలో అధికారులు నోట్లో గొట్టం పెట్టినప్పుడు దొరికిపోయావా, జేబుకి భారీ రంధ్రమో, జైలు శిక్షలో, సురుక్కుమనే ఎండలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులో, పారిశుద్ధ్య కార్యక్రమల్లాంటి కుంభీపాకపు శిక్షలతో సరదా తీరిపోతుంది. చట్టానికి వెటకారంగాని బారుల దగ్గర కుప్పలు తెప్పలుగా టూవీలర్సు కనబడుతుంటాయి. చీకటిపడినా పడకపోయినా డిపార్టుమెంటువారు ప్రక్క సందులో చాటుగా నిలబడి చోదకుడు కిక్కుకొట్టి ఎక్కిన తర్వాత వలవిసిరితే పక్షులు టపటపా పడిపోగలవు. మర్నాడు బారు ఖాళీ అనుకోండి.

ఇలా డ్రంకెన్ డ్రయివ్ అనే ప్రమాదాన్ని దాటేందుకు కొత్త కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. ఈ ఆపద్భాందవులు దారికొచి ప్రమాద ఘంటికలు మ్రోగే స్థలం దాటించే వరకూ వారే నడిపి గట్టెక్కిస్తున్నారు. ఫీజు భారీగానే వసూలు చేస్తున్నారు.  ఈ సంపాదనంతా దేనికి ఖర్చుపెడతాడో మనకనవసరం. ఒకపక్క కేసీఆర్ గారు చీప్ లిక్కర్ పాలసీ కూడ ప్రకటింపచేసేరు. ఇక మందే మందు. డోర్ డెలీవరీ సిస్టమ్ ఒకటే మిగిలింది. ఆమెన్... తధాస్తు!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ