హైదరాబాద్‌లో 2015 నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే నేపధ్యంగా జరిపే వేడుకలలో సైబరాబాద్ పోలీసులు కొన్ని ఆంక్షలను విధించారు. ఈ మేరకు డిసెంబర్31వ తేదీ రాత్రి 8గంటల నుండి రాత్రి 1గంట వరకు మాత్రమే వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అలాగే డీజేలు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని, పార్టీలో పాల్గొనే మహిళలకు ప్రత్యేక బ్యారక్‌లు ఉండాలని ఆనంద్ సూచించారు. ఇక ఆయుధాలతో వచ్చే వారిని వేడుకలకు అనుమతించ రాదంటూ కమీషనర్ హెచ్చరిక జారీ చేశారు. అలాగే డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 గంటల నుండి మర్నాడు ఉదయం 5గంటల వరకు ఫ్లై ఓవర్ లను, ఔటర్‌రింగ్ రోడ్డును మూసివేస్తున్నట్లు సైబరాబాద్ కమీషనర్ ఆనంద్ స్పష్టం చేశారు.