నీహార్ అందిస్తున్న సువర్ణ, రజతావకాశం

October 29, 2015 | 11:28 AM | 5 Views
ప్రింట్ కామెంట్
niharinfo-pvt-limited-goldnsilver-grand launch-niharonline

సాప్ట్ వేర్ రంగంలో 21 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వస్తున్న సంస్థ నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్. ఈ సంస్థ అనతికాలంలోనే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) జాబితాలో చేరింది. సాప్ట్ వేర్ పతనమయిన సమయంలో కూడా తట్టుకుని నిలదొక్కుకుంది. ఇక ఆరంభంలో కంటెంట్ పోర్టళ్లను మాత్రమే నడిపిన ఈ సంస్థ క్రమంగా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ-కామర్స్ బూమ్‌ను ఆసరా చేసుకుని మరో ప్రయత్నం ప్రారంభించింది. నీహార్ మార్కెట్ డాట్ కామ్ పేరిట ఏడు ఈ కామర్స్ పోర్టళ్లను ప్రారంభించి ఒక్కొక్కటిగా మార్కెట్లోకి తెస్తూ వస్తుంది. కంటెంట్‌ పోర్టళ్ల విషయంలో ఎలా అయితే సక్సెస్ అయిందో ఇప్పుడు ఈ-కామర్స్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అవలంభించాలన్న ఆలోచనను క్రమంగా ఆచరణలో పెడుతున్నారు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ బి.ఎస్.ఎన్.సూర్యనారాయణగారు.

            ఇక ఈ క్రమంలోనే బంగారం, వెండి అమ్మకాలకు సంబంధించి గోల్ట్-ఎన్-సిల్వర్ డాట్ ఇన్ ఈ-కామర్స్ పోర్టల్ ను ప్రారంభించనున్నారు. మొట్టమొదటిసారిగా ఏ సంస్థా అందించని రీతిలో 92.5 ప్యూర్ సిల్వర్ ఉత్పత్తులను అందించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. వేడుకలకు సంబంధించి బహుమతులు, దేవతామూర్తుల విగ్రహాలు, పూజా సామాగ్రితోపాటు భోజనసామాగ్రిని తదితర ఉత్పత్తులు ఇందులో లభించనున్నాయి. వీటితోపాటు ఉత్పత్తుల జాబితాలో మింటెడ్ బంగారు, వెండి... నాణేలు, బార్లు, లాకెట్లు అందించనున్నారు. అంతేకాదు, కార్పొరేట్లకు బల్క్ ఆర్డర్లతోపాటు, పెట్టుబడులకు గోల్ట్ స్కీమ్ ను కూడా అందించనుంది. వినియోగదారులకు స్వచ్ఛమైన బంగారం, వెండి విక్రయించడానికి ప్రమాణాలు పాటించే అగ్ర కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని మరీ ఈ గోల్డ్-న్‌-సిల్వర్.ఇన్‌ను ప్రారంభిస్తున్నారు.


టాలీవుడ్ అగ్ర దర్శకుడు, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు ముఖ్యఅతిథిగా, సహజ నటి డాక్టర్ జయసుధ, మరోనటి జీవితారాజశేఖర్ లు గౌరవ అతిథులుగా ఈ పోర్టల్ ను ప్రారంభించనున్నారు. పలు ప్రముఖులు హాజరు కానున్న ఈ కార్యక్రమం ఈనెల 30 న హైదరాబాద్ లోని అమీర్ పేట సమీపంలోని హోటల్ మారిగోల్ట్ లో సాయంత్రం 7గంటల 30 నిమిషాలకు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ-కామర్స్ రంగం పరిస్థితి సాఫీగా ఏమీ లేదు. అయినా పోటీకి మాత్రం తక్కువ లేదు. అలాంటి ఈ రంగంలో సొంత నిధులతో చిన్న కంపెనీలు నెట్టుకు రావటం సులభమేమీ కాదు. మరి ఇలాంటి సమయంలో నీహార్ సంస్థ చేస్తున్న ఈ సాహసం నిజంగా అభినందనీయం. నీహార్ సంస్థ నుంచి అనుబంధ సంస్థగా వస్తున్న ఈ గోల్ట్-ఎన్-సిల్వర్ పోర్టల్ ఉన్నత శిఖరాలనందుకోవాలని ఆశిస్తూ... ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.    

భాగస్వాములు:

స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ముంబై,

వోర్రా ఎంటర్ ప్రైజెస్, న్యూఢిల్లీ,

ఎంఎంటీసీ-పీఏఎంపీ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై,

మస్కాన్ సిల్వర్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూఢిల్లీ.


పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్ సైట్ goldnsilver.in తోపాటు niharonline.com, niharmarket.com లను సంప్రదించగలరు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ