సారీ... వెళ్లిపోయిన భార్యను వెనక్కి రప్పించలేం

January 30, 2015 | 01:12 PM | 102 Views
ప్రింట్ కామెంట్

భర్త అంటే ఇష్టం లేక వేరేవారితో వెళ్లిపోయిన భార్యను వెనక్కి రప్పించేందుకు ఆదేశించలేమని హైకోర్టు తీర్పునిచ్చింది. మరో వ్యక్తితో కలిసి ఉన్న తన భార్యను తనకు అప్పగించేందుకు హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. అసలు భార్యాభర్తలను కలిసి కాపురం చేయాలని తాము ఎటువంటి ఆదేశాలు జారీచేయలేమని స్పష్టంచేసింది. తనను వదిలి మరొక వ్యక్తితో కాపురం చేస్తున్న భార్యను తన దగ్గరకు పంపించాలని కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ అంశం హెబియస్ కార్ఫస్ పరిధిలోకి రాదని చెప్పింది. వ్యక్తిగత స్వేచ్చను హరించే విధంగా వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్భంధించిన సమయంలో మాత్రమే హెబియస్ ను పరిగణలోకి తీసుకుంటామని, ప్రైవేట్ వ్యక్తుల విషయంలో, ముఖ్యంగా భార్యభర్తల విషయంలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టంచేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ