ఒక్క మిస్డ్ కాల్ ఆ యువకుడి జీవితంలో భీభత్సమైన మలుపు తిప్పింది. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఓ యువకుడు స్థానికంగా డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల తన మొబైల్ నుంచి తన స్నేహితుడికి కాల్ చేశాడు. అయితే అది పొరపాటున రాంగ్ నంబర్ గా గుర్తించి వెంటనే కట్ చేశాడు. ఆ కాల్ తన జీవితాన్ని మార్చేస్తుందని ఆ క్షణంలో ఆ యువకుడు ఊహించి ఉండడు. ఆ కాల్ భర్తను కోల్పోయి పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఇల్లెందుకు చెందిన ఓ యువతికి వెళ్లింది. మిస్డ్ కాల్ చూసుకున్న ఆ యువతి తిరిగి ఆ యువకుడికి కాల్ చేసింది. దాంతో వీరిద్దరి మధ్య పరిచయం... ఆ తర్వాత ప్రేమగా మారింది. ఓ రోజు యువతి ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె అత్తమామలు, బస్తీవాసులు కలిసి అతన్ని నిర్బంధించారు. ఇక సీన్లోకి వచ్చిన పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో వారిద్దరు పెళ్లికి అంగీకరించారు. శాంతించిన స్థానికులు ఊరిపెద్దలు స్థానికంగా ఓ దేవాలయంలో వారిద్దరికి వివాహం జరిపించారు. బీకేర్ ఫుల్ బ్రదర్స్...