ఉస్మానియా యూనివర్శిటీ మా సొత్తు

May 19, 2015 | 03:51 PM | 51 Views
ప్రింట్ కామెంట్
Osmania_UnivArts_niharonline

స్వంత ఇల్లు లేని ప్రతి కుటుంబానికి నగరంలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఇళ్ళు కట్టిస్తామని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హామి చ్చారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా పార్శీ గుట్టలోని బస్తీ వాసులతో మాట్లాడుతూ...ఉస్మానియా యూనివర్శిటీకి సంబంధం లేకుండా రోడ్డుకు ఇవతలి వైపున ఉన్న భూమిని ఇళ్ళ కోసం ఉపయోగిస్తామని అన్నారు. దీనిపై ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఓయూలో ఇప్పటికే పలు భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని విడిపించాల్సింది పోయి ఇంకా ఇక్కడి భూములను ఇళ్ల నిర్మాణానికి ఇస్తామనడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ హామీకి నిరసనగా విద్యార్థులు మంగళవారం ఉస్మానియా యూనివర్శిటీలో ధర్నాకు దిగారు. యూనివర్శిటీ భూముల జోలికి వస్తే ఊరుకోమని వారు ఈ సందర్భంగా కేసీఆర్ ను హెచ్చరించారు.  అనంతరం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ