అది మా సంపద: ఉస్మానియా విద్యార్థులు

May 20, 2015 | 03:42 PM | 28 Views
ప్రింట్ కామెంట్
ou_students_niharonline

ఉస్మానియా యునివర్సిటీకి చెందిన ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసనలు ఆగడం లేదు. వరుసగా మూడోరోజు కూడా ఆందోళనతో ఓయూ క్యాంపస్ దద్ధరిల్లింది. కాగా కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు బుధవారం, గురువారం ఓయూ బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.  బుధవారం ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని, గ్రేటర్ పరిధిలో వేలాది ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చని విద్యార్థి నేతలు పేర్కొన్నారు. వర్సిటీ భూములపై కేసీఆర్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోకుంటే టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. జూన్ 2న జరిగే ఆవిర్భావ ఉత్సవాలనూ అడ్డుకుంటామన్నారు. యునివర్సిటీ భూములు తెలంగాణా విద్యార్థుల సంపద అని ఆ సంపదను రక్షించుకోవటానికి ఎంత దూరమైనా పోరాడతామని విద్యార్థులంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ