ఇకపై ఫస్ట్ లాంగ్వేజ్ గా ఉర్దూ ఆప్షన్‌!

May 20, 2015 | 02:09 PM | 19 Views
ప్రింట్ కామెంట్
urdu_option_niharonline

తెలంగాణా రాష్ర్టంలో ఇక నుండి విద్యార్థులు ఉర్దూను ఫస్ట్ లాంగ్వేజ్ (మొదటి భాష) ఆప్షన్‌గా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండో భాషగా ఉన్న ఉర్దూను చాలా మంది విద్యార్థులు మొదటి భాషగా తీసుకునే అవకాశం కల్పించాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. దీనికి స్పందించిన సీఎం సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ప్రతి జిల్లాలో మైనారిటీలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఒక హాస్టల్ నెలకొల్పాలని, రాష్ట్రంలోని మైనారిటీలకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 75 వేల మంది మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ