పవన్ పై పుస్తకం

December 17, 2014 | 02:40 PM | 23 Views
ప్రింట్ కామెంట్

ఒక పక్క పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా, మరో పక్క ఆయనపై 'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' పుస్తకాన్ని రాశారు ఓ రచయిత. ఆయన కోరిక మేరకు ఆ రచయితకు రక్షణ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. ఈ పుస్తకాన్ని రాసింది తార్నాకకు చెందిన బొగ్గుల శ్రీనివాస్. శ్రీనివాస్ బుధవారం నుంచి 26వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో పుస్తకాలను కూడా ప్రదర్శించి విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో పవన్‌తో పాటు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని శ్రీనివాస్ సోమవారం సచివాలయంలో హోంమంత్రిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ పుస్తక ప్రదర్శనకు పూర్తి బందోబస్తుతో పాటు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా హోమంత్రి, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి సమాచారం అందించారు. మహేందర్‌రెడ్డి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. రక్షణ కల్పించినందుకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ