అంత ప్రేమ ఉంటే జిల్లా పేరు మార్చుకో

November 25, 2014 | 05:16 PM | 21 Views
ప్రింట్ కామెంట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి స్వర్గీయ ఎన్టీఆర్ పై నిజంగా ప్రేమ ఉంటే ముందు కృష్ణా జిల్లా పేరు మార్చమంటున్నాడు తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శంషాబాద్ దేశీయ టర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ నేతలు ఎన్టీఆర్ ను అవమానిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్ అంటే నిజంగా ప్రేమ ఉంటే ముందు కృష్ణా జిల్లా పేరు మార్చాలని, ఆయన కుమారుడు ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుకు సూచించాడు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని పొన్నం ఆరోపించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ