ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా!

December 09, 2014 | 10:27 AM | 105 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, దేవాదుల ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు పార్లమెంట్‌కు వెళ్లిన కేసీఆర్, అక్కడ టీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. అనంతరం ముఖ్య నేతలతో కలిసి శ్రమశక్తి భవన్‌కు వెళ్లి కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరాంతోపాటు ఆ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రాతో ఏం లడాయి లేదుగా అని కేంద్రమంత్రి అడిగినట్లు సమాచారం. దీనికి సీఎం కేసీఆర్ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారట. తెలంగాణకు కూడా జాతీయ ప్రాజెక్టు ఉండాలని నేను చాలా ఆత్రుతతో ఉన్నా. మా అధికారులతో వీలైనంత త్వరగా చర్చిస్తా. మేం చాలా సానుకూలంగా ఉన్నాం. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహాలు వద్దు అని ఉమభారతి సీఎం కేసీఆర్ కు హామీనిచ్చిందని తెలుస్తోంది. తెలంగాణలో దేవాదుల పూర్తి చేసేందుకు కూడా సహకరించాలని సీఎం కోరగా... ఈ ప్రాజెక్టుకు వారం రోజుల్లో మొదటి విడత కింద రూ.64 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ