శ్రీశైలం జలాశయం నుండి నీటి చేరిక తగ్గడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం రోజు రోజుకు తగ్గిపోతోంది. శుక్రవారం సాయంత్రానికి సాగర్ లో నీటిమట్టం 560.7 అడుగులకు చేరుకుంది. ఇది 234.0796 టీఎంసీలకు సమానం. వ్యవసాయ ఉత్పత్తుల నిమిత్తం కుడి కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా ఐదు వేల క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తం ఔట్ ఫ్లో 14,500 క్యూసెక్కులు కాగా, శ్రీశైలం నుండి సాగర్ జలాశయానికి 12,405 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 854.7 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఎగువ నుంచి శ్రీశైలానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.