పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవట్లేదంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వైఖరిని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అసలు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన స్పీకర్ ను అడిగారు. ఎమ్మెల్యే పదవికి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన రాజీనామాను ఇంతవరకు ఎందుకు ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు. తలసాని స్వయంగా స్పీకర్ కు రాజీనామా ఇచ్చారని గుర్తు చేశారు. సభా సంప్రదాయాలను టీఆర్ఎస్ పార్టీ తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. సభలో సభ్యులను గౌరవప్రదంగా చూడడంలేదని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రొత్సహిస్తున్న కేసీఆర్ కు, దమ్ముంటే వారిచేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు జరిపించాలని రేవంత్ సవాలు విసిరాడు. ఉప ఎన్నికలకొస్తే ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుందని చెప్పారు.