‘హైటెక్’ వ్యభిచారం: వాట్స్ యాప్ ద్వారా అమ్మాయిల ఎర

June 29, 2015 | 05:08 PM | 17 Views
ప్రింట్ కామెంట్
hyderabad_sex_racket_in_whatsapp_facebook_niharonline

సామాజిక మాధ్యమాల పనితనం మరోసారి రుజువయ్యింది. ఈ మధ్య ఓ చిత్రం వచ్చింది. అందులో లపాకీ అనే ఓ యాప్ ద్వారా సమీపంలోని వ్యభిచార గృహాల సమాచారం సులువుగా కనిపెడతారు. అయితే నిజ జీవితంలో ఇలాంటి యాప్ లేదనుకోండి. కానీ, వాట్స్ యాప్ నే అంతకు మించిన ఆయుధంగా వాడుకుంటూ హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు. ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే. సామాజిక మాధ్యమాల ద్వారా విటులను ఆకర్షిస్తూ, ఈ తతంగానికి పాల్పడుతున్న కొందరిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇన్ స్టాంట్ మేనేజింగ్ అఫ్లికేషన్స్ ద్వారా అమ్మాయిల ఫోటోలను షేర్ చేస్తుంటారు. వాట్స్ యాప్ ద్వారా ఢిల్లీ, ముంబైతోపాటు ఏపీ  నుంచి తెచ్చిన అమ్మాయిల ఫోటోలను పంపుతారు. వీటి కోసం ప్రత్యేకంగా గ్రూప్ లు క్రియేట్ చెయ్యటం కొసమెరుపు.  ఇక నచ్చిన అమ్మాయిని బ్రోకర్లు విటుల వద్దకు కార్లలో పంపుతారు. అమ్మాయి అక్కడికి చేరుకోగానే డబ్బును ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఇక ఈ వ్యవసానికి లొంగుతున్నవారిలో ధనికుల కంటే మధ్యతరగతి వారే ఎక్కువగా ఉండటం విశేషం. నెలరోజులుగా పక్కా ప్రణాళికతో మాటు వేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి పెద్ద మొత్తంలో ఈ దందా నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండే ఎస్ ఆర్ నగర్ లో ఈ బడా సెక్స్ రాకెట్ బయటపడటం విశేషం. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ