డబ్బు కోసం ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్ కి బ్లాక్ మెయిల్

June 10, 2015 | 04:13 PM | 19 Views
ప్రింట్ కామెంట్
Youth_blackmails_facebook_girl_friend_niharonline

సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే చెడు పరిణామాల గురించి ఎప్పటికప్పుడు ఎన్ని సంఘటనలు బయటపడుతున్నప్పటికీ యువత మాత్రం అప్రమత్తంగా ఉండటం లేదు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఘటనను పరిశీలిస్తే... హైదరాబాద్ లో బీఎన్ రెడ్డి నగర్ కి చెందిన అరుణ్ రెడ్డి అనే యువకుడు వనస్థలిపురం కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిని ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజుల చాట్ తర్వాత ఓరోజు వారిద్దరు కలుసుకున్నారు. అలా కొంత కాలం గడిచాక అరుణ్ డబ్బు కావాలని ఆ యువతిని వేధించసాగాడు. లేదంటే వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను యువతి తల్లిదండ్రులకు చేరవేస్తానని బెదిరించాడు. భయపడిన ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉన్న డబ్బు, నగలను అరుణ్ కి అందజేసింది. తల్లిదండ్రులు వాటి గురించి అడగగా, దొంగతనం జరిగిందని కట్టుకథ అల్లింది. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక విచారణలో ఈ అసలు బాగోతం బయటపడింది. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డబ్బు, నగలను రికవరీ చేశారు. సోషల్ మీడియా వల్ల ముఖ్యంగా ఫేస్ బుక్ లాంటి మాధ్యమంలో అపరిచితులతో జరిగే సంభాషణలు ఎప్పటికైనా ప్రమాదమే ఈ సంఘటన మరోమారు తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ