శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు త్వరలో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఉందానగర్ వరకు డెమో రైళ్లను నడపనున్నారు. ఉందానగర్ రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోవున్న విమానాశ్ర యానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తారు. ఇందు కోసం ట్రైన్- బస్సు లింకు సర్వీసులను అందుబాటులోకి తేవాలని దక్షిణమధ్య రైల్వే యోచిస్తోంది. ప్రయాణికుల సదుపాయాలకే దక్షిణమధ్య రైల్వే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అన్నారు.