తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితదాస్ సభర్వాల్‌పై గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రదీప్‌కుమార్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశారు. 2003లో స్మితదాస్ మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో కొండామర్రిపల్లె సమీపంలో గాయిత్రీస్టోన్ క్రషర్స్‌లో 38 మంది చేత వెట్టిచాకిరీ చేయిస్తుండడంతో గుర్తించిన స్మితదాస్ యజమాన్యం క్రిష్ణమూర్తి, శ్రీనివాసులుపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో వుంది. కాగా 2009 నుంచి స్మిత కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో మదనపల్లె ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 15లోగా ఆమె కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.