నోరు తెరిస్తే ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు మాటల తుటాలు పేల్చుకుంటారు. అలాంటిది టీ రాష్ట్ర మంత్రి ఒకరు ఆంధ్రకు వెళ్లి ఆశ్చర్యపరిచారు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విజయవాడలో పర్యటించి, అక్కడ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. జనతాపార్టీ మాజీ అధ్యక్షుడు ఎంఏ రెహమాన్ స్మారక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. మీడియా సమావేశంలో ఆయన తెలంగాణలో చేపట్టబోయే పథకాల గురించి వివరించటం విశేషం. హైదరాబాద్ లో కొత్త కంట్రోల్ రూం ఏర్పాటు, షి టీంల పనితీరుపై ఆయన ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. అంతేకాదు తామెప్పుడూ ఆంధ్రా గోబ్యాక్ అని అనలేదని, ఉపాధి పేరుతో వచ్చి దోచుకున్న వాళ్లనే వెళ్లమన్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఓ తెలంగాణ మంత్రి ఏపీలో అడుగుపెట్టడం, ఏకంగా మీడియా సమావేశం నిర్వహించటం వండరే కదా.