తాగర అన్నా... తాగి ఊగర అన్నా!!

August 29, 2015 | 12:31 PM | 7 Views
ప్రింట్ కామెంట్
telangana_government_allow_beer_making_policy_niharonline.jpg

ఓ వైపు చీప్ లిక్కర్ పాలసీతో ప్రజల వద్దకు మద్యం తీసుకునే ప్లాన్ లో ఉన్న తెలంగాణ సర్కార్ మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా తాజాగా మైక్రో బ్రూవరీలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇందుకు తగిన విధంగా శుక్రవారం(ఆగస్టు28) నాడు జీవో నెంబరు 151ను తెలంగాణ సర్కారు విడుదల చేసింది.

వెయ్యి చదరపు మీటర్ల స్థలాన్ని చూపించి.. రోజుకు వెయ్యి లీటర్ల బీరును తయారు చేసుకునేలా అవకాశం కల్పించనుంది. దీంతో పెద్ద పెద్ద హోటళ్లు, బార్లు,  సొంత బీరును తయారు చేసుకొని అమ్ముకునే వీలు ఉంటుంది. కాకపోతే బీరు తయారు చేసిన 36 గంటల వ్యవధిలోనే సదరు బీరును తాగాల్సి ఉంది. వాటర్ ఫ్లాంట్లు ఏ విధంగా అయితే నెలకొల్పుతారో.. తాజా విధానంతో చిన్న చిన్న బీరు ఫ్లాంట్లను ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది.

                 తొలిదశలో జీహెచ్ ఎంసీ పరిధితో పాటు.. దాన్ని అనుకొని ఉండే 5 కిలోమీటర్ల ప్రాంతాల్లోనూ.. పర్యటక ప్రాంతాల్లోనే ఇలాంటి ఫ్లాంట్లను ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి ఇస్తారు. తర్వాతి దశల్లో కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల్లోనూ తమ సొంత బ్రాండ్లలో బీరు తయారు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తారు. బీరు తయారీకి సంబంధించిన అనుమతులు,  విధివిధానాలు చాలా సులభంగా ఉండటంతో.. రానున్న రోజుల్లో ‘‘లోకల్ బీరు’’ హవా నడవటం ఖాయమన్న వాదన వ్యక్తమవుతోంది. సంక్షేమ కార్యక్రమాల మాదిరి... ఎక్సైజ్ విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా టీ సర్కార్ వేస్తున్న స్టెప్పులు మంచికో చెడుకో కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ