విషమే ఔషధమనే భావన రానీవోయ్

September 25, 2015 | 04:01 PM | 3 Views
ప్రింట్ కామెంట్
toddy-liquor-deaths-increased-in-telangana-niharonline

హాయిగా కల్తీకల్లు తాగుతూ కాలక్షేపం చేసే బడుగు జీవుల బ్రతుకుల్లో ఆ నాలుగు చుక్కల విషం దొరక్కుండా చేసి చిచ్చురేపుతున్నారు. కల్తీకల్లు గొంతులో పడక జనం చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, ఆసుపత్రి పాలవ్వడం చివరికి ప్రాణాలు పోవడం, ప్రాణాలు తీసుకోడం పరిపాటిగా మారిపోయింది. నాలుగేళ్ల బుడతడికి రెండేళ్ల సంది కల్లు హాబీ అయ్యింది. సదరు కల్లులో డైజోఫాం తదితర విషపదార్థాలు కలిపి ఉండటంతో, చిరంజీవి సోనుబాబుకి బాగా వంటబట్టింది. నాలుగు రోజులు తాగకుండా మడికట్టుక్కుర్చోవడంతో పీకల మీదకొచ్చింది.

సమయ స్ఫూర్తి మెండుగాగల ఒకానొక మేధావి చిట్కా వైద్యం చేసి పిల్లవాడి నిండు ప్రాణాలు కాపాడేడు. డాక్టర్లవలన కానిది గుక్కెడు కల్లుతెచ్చి నాలుగు గుటకలు వేయించగా సోనుబాబు ఆరోగ్యం యథాస్థితికి వచ్చి కళకళలాడుతూ చెంగుచెంగున దూకుతూ ఆ తలిదండ్రుల నోముల పంట ఆ ఇంటికి, ఆ గ్రామానికి, ఆ మండలానికి కనులపండగ చేశాడు. కల్తీకల్లు అయితేనేమి, ఆ తలిదండ్రుల వంశాకురాన్ని నిలబెట్టిన ఘనత దక్కించుకుంది. సోనుబాబూ దీర్ఘాయుష్మాన్ భవ కల్తీకల్లు జిందాబాద్ !  ఈ ఘటన పురస్కరించుకుని బాబారాందేవ్ మున్నగు విజ్నులు పరిశోధనలకు పూనుకోవాలని విజ్నప్తి!  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ