ఊరుగానీ ఊరొచ్చి మహానుభావుల విగ్రహాలు వెలసిన ట్యాంకుబండు వెనుక ఊరేసుకున్న లింబయ్య ఉసురు ఎలా తీసుకున్నాడు అనే మీమాంస మీద ప్రభుత్వ త్రిసభ్య కమిటీ వేసింది. దయగల మారాజులు రంధ్రాన్వేషణ చేసి కనిపెట్టిన కొన్ని నిజాలు...
- లింబయ్య ఆర్థికంగా భేషుగ్గా ఉండి అప్పులిచ్చే వ్యసనపరుడు.
- లింబయ్య ఆరెకరాల ఆసామి
- లింబయ్య పండించిన మూడెకరాల్లో దిగుబడి మెరుగ్గా ఉన్నది
- లింబయ్యకి రుణమాఫీ లబ్ధిచేకూరింది
- లించయ్య కొడుకు కూడా వ్యాధిగస్త్రులు
- లింబయ్య ఆయన కుటుంబం రెండు వేలు ఫించను తింటున్నారు
- లింబయ్య తండ్రికి కూడా వెయ్యి ఫించను అందుతుంది
అయినప్పటికీ కీర్తిశేషులు లింబయ్య గారు అప్పుల బాధతోగాక వ్యవసాయం నష్టమొచ్చిగాక ఇతర సమస్యలతో స్వర్గస్తులయ్యారు. పైన పేర్కొన్న సకల సౌకర్యములూ అనుభవిస్తున్నప్పటికీ ఆత్మహత్య అనే విముక్తి మార్గాన్ని లింబయ్య ఎందుకు ఎంచుకున్నట్లు? ఈప్రశ్నకు జవాబు తెలిసుండీ జవాబు చెప్పక, తగు సాయం అందించక పోయినట్టయితే సంబంధీకుల తలలు వెయ్యి వ్రక్కలు అయిపోగాక! అన్నం పెట్టే రైతు ఆత్మహత్యపై రాజముద్ర మరీ ఇంత దారుణంగానా? లింబయ్య అమరహే...