ఇద్దరమ్మాయిలు... సాంతం నాకించేశారు

September 08, 2015 | 02:07 PM | 7 Views
ప్రింట్ కామెంట్
hyderabadi-girls-trapped-som-many-peoples-through-facebook-niharonline.jpg

అమ్మాయిలను ట్రాప్ చేసి ఎర వేసి వారిని వాడుకుని మోసం చేసిన ఘటనలకు సోషల్ మీడియా వేదికైన ఉదంతాలు మనం ఎన్నో చూశాం. తీరిగ్గా మోస పోయాక అయ్యయో అని నెత్తి నోరు బాదుకుని పోలీసుల నాశ్రయించడం, వారు ప్రెస్ మీట్ లు పెట్టి అలర్ట్ గా ఉండండని చెప్పడం గమనించాం. కానీ, కాలం మారింది. పరిస్థితులు మారాయి. ఆడవాళ్లు మగాళ్లతో పోటీపడుతున్నారు. ఆఖరికి మోసాల్లో కూడా... సోషల్ మీడియాల్లో  చీటింగ్ లు మగవాళ్లకే సొంతం అన్న దానికి చెల్లు చీటి ఇచ్చారు ఓ ఇద్దరు హైదరాబాదీ అమ్మాయిలు.

పాత బస్తీకి ఇద్దరు టీనేజీ యువతులు ఫేస్ బుక్ లో ఎడాపెడా ఓ 20 అకౌంట్లు తెరిచారు. అందమైన అమ్మాయిల ఫోటోలను అప్ లోడ్ చేసి రిక్వెస్ట్ లు పంపి కనిపించిన కుర్రాళ్లందరినీ యాడ్ చేసుకున్నారు. ఇక వారితో చాటింగ్ రాయబారం జరిపి ప్రేమ మత్తులోకి దించారు. కష్టాల్లో ఉన్నామంటూ వేలకు వేలు దండుకున్నారు. ఓ బకరా అయితే ఏకంగా 40 వేలు విలువ చేసే కెమెరాను సమర్పించుకున్నాడు. చివరికి మోసపోయామని ఓ అంచనాకు వచ్చిన యువకులు పోలీసులనాశ్రయించిన వారి లిస్ట్ చాంతాడంత ఉండటంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారట. దాంతో కిలాడీ లడికీలను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.  సోమవారం ఒక్కరోజే ఓ 20 మందిని పోలీసులు విచారించారట. వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా? అసలు మ్యాటరేంటనే పనిలో బిజీగా ఉన్నారిప్పుడు.    

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ