వాట్స్ యాప్ తో పోలీసు సేవలు మెరుగు

December 19, 2014 | 04:36 PM | 57 Views
ప్రింట్ కామెంట్

సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఇప్పుడున్న సోషల్ నెట్ వర్క్ యాప్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వాట్స్ యాప్... ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా ఈ పదమే! ఈ టెక్నాలజీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు తమ విధుల్లో భాగం చేశారు. ఇప్పుడు వాట్స్ యాప్ అప్లికేషన్ ద్వారా ప్రజలకు చేరువవడానికి సన్నద్ధులయ్యారు. ఫోన్, ఫేస్ బుక్ కంటే వాట్స్ యాప్ ద్వారానే చాలా సులభంగా ప్రజలకు సేవలందించవచ్చునని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కరీంనగర్ పోలీసులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నట్టు ప్రకటించారు. తామిచ్చే ఒక నెంబర్ ను వాట్స్ యాప్ లో యాడ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఆండ్రాయిడ్, ఐఓస్ లపై పనిచేసే ఫోన్ల లో వాట్సప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని, తర్వాత అందులో తమ నంబర్ ను యాడ్ చేసుకోవాలని వారు ప్రజలకు సూచిస్తున్నారు. కంట్రోల్ రూము నుంచి డెస్క్ టాప్ ద్వారా ఈ యాప్ లో పర్యవేక్షిస్తుంటామని పోలీసులు వివరించారు. వాట్స్ యాప్ ద్వారా వీడియోలు కూడా సెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నందున ఈ వ్యవస్థ ద్వారా నేర సమాచారాన్ని వేగంగా, సులభంగా పొందడానికి అవకాశం ఉందని పోలీసులు వివరించారు. ఈ పద్ధతిని కరీంనగర్ లో ప్రవేశపెట్టినా అన్ని జిల్లాలు ఫాలో అవడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ