కల్తీ కిక్కు... కాల కూట విషం

September 23, 2015 | 12:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
toddy-liquor-kallu-deaths-in-telangana-niharonline

గుడుంబా విక్రయాలను నిర్మూలించేందుకు చీప్ లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టాలని భంగపడిన కేసీఆర్ ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. ప్రజా సంక్షేమం అంటూ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంతో విచిత్రమైన పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో నెలకొంది. గత కొద్దిరోజులుగా కల్లు మరణాలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కల్తీ కల్లును అరికట్టే ఉద్ధేశంతో ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. రసాయనాలు కలపని స్వచ్ఛమైన కల్లునే విక్రయించాలని, నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీచేసింది. అయితే టీ ప్రభుత్వం ఒక్కసారిగా కల్తీకల్లుపై ఉక్కుపాదం మోపడంతో అంతటా ఈ విపత్కర పరిస్థితి నెలకొంది.

                            ఇప్పటివరకూ కిక్కిచ్చే కల్లు దొరకక 15 మంది మృతి చెందారు. ఒక్క పాలమూరు జిల్లాలోనే 11 మంది మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లాలో నలుగురు మరణించారు. మానసిక స్థిరత్వాన్ని కోల్పోయి, వింతగా ప్రవరిస్తూ, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కల్తీ కల్లులో క్లోరోఫాం, డైజోఫాం, అల్ఫోజోమ్, హైడ్రేడ్, యూరియా, కుంకుడు కాయలు, శాకరీన్ వంటి పదార్ధాలను కలుపుతారు. దీంతో ఆ కల్లును తాగగానే మత్తులో తూగుతుంటారు. 180మిల్లిలీటర్ల లిక్కర్ సేవిస్తే ఎంత కిక్కు వస్తుందో... ఈ కల్తీ కల్లు రెండు మూడు గ్లాసులకు అంత ప్రభావం చూపుతుంది. దీనిని బట్ట అర్థం చేసుకోవచ్చు కల్తీ ఏ రేంజ్ ప్రభావం చూపుతుందంటే... దీని ప్రభావంతో కాలేయం దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవటం, ఒక్కొసారి  ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఒక్కసారి కల్తీ కల్లు కి అలవాటు పడినవారు దానిని వీడరని. వారికి తరచూ గొంతు ఎండిపోతూ ఉంటుంది, దాహం వేసినా నీరు తాగరు. దానికి విరుగుడు మళ్లీ అదే కల్తీ కల్లు. అది దొరక్కపోతే ఉన్మాదిలా మారితారు, కొన్ని సందర్భాల్లో పిచ్చివారిగా మారి దారుణాలకు కూడా పాల్పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దశల వారీగా చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా హఠాత్తుగా ఆపేయటంతోనే విపరీత పరిస్థితులు నెలకొన్నాయని వైద్యులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ