విచారణలో వరంగల్ ఎన్ కౌంటర్ కేసు

January 19, 2015 | 06:00 PM | 58 Views
ప్రింట్ కామెంట్

2008లో జరిగిన యాసిడ్ దాడి కేసు ఎప్పటికీ మరిచిపోలేనిది వరంగల్ జిల్లాలో ఇద్దరు బీటెక్ విద్యార్థినులు ప్రణీత, స్వప్నికలపై యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు అప్పట్లోనే జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నిందితులు దొంగిలించిన బైకుని రికవర్ చేసుకునే ఉద్దేశంతో వరంగల్ పోలీసులు నగర శివార్లలోని మామునూరుకు తీసుకెళ్లారు. అక్కడ నాటుతుపాకీతోపాటు యాసిడ్, కత్తులతో తమపై దాడికి పాల్పడగా ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ముగ్గురు నిందితులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. అయితే ఆ ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆరోపిస్తూ ఆ ముగ్గురు నిందితుల తరపు బంధువులు హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటినుంచి హైకోర్టులో ఈ కేసు విచారణ నడుస్తోంది. తాజాగా సోమవారంనాడు కోర్టులో ఈ కేసు విచారణకురాగా.. కేసు వివరాల్నిపరిశీలించిన జడ్జీ మరో రెండు వారాలపాటు విచారణని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2008లో జరిగిన ఈ ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులలో స్వప్నిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందగా.. ప్రణీత కోలుకుంది. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో వరంగల్ జిల్లా ఎస్పీగా సజ్జనార్ వున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ