ప్రియుడి కోసం డాక్టర్ వేషం కట్టి బుక్కయిపోయింది

July 08, 2015 | 02:29 PM | 17 Views
ప్రింట్ కామెంట్
nurse_cheating_as_doctor_gandhi_hospital_niharonline

వయస్సులో తన కన్నా 12 ఏళ్లు తక్కువ వయస్సున్న యువకుడిని ప్రేమించింది. అతన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంది. మోసాలు చేసింది... అబద్ధాలు చెప్పింది... చివరికి వేషం మార్చి దొరికిపోయింది. వివరాళ్లోకి వెళ్లితే... 33 ఏళ్ల ఓ మహిళ హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లోని అద్దెకు నివాసం ఉంటుంది. భర్త రెండేళ్ల క్రితం ఓ రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోగా, గాంధీ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తూ కాలం గడుపుతోంది. ఈ మధ్యే బేగంపేట్ కు చెందిన ఓ యువకుడితో(20) పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అయితే స్టాఫ్ నర్స్ అని చెబితే వదిలిపోతాడేమో అనుకుని,  కాస్త గొప్పగా ఉంటుంది కదా సో... డాక్టర్ అని చెప్పుకుంది. తానూ ఆస్పత్రికి వస్తానని ఆ యువకుడు అడగడంతో ఓ ఫ్లాన్ వేసింది. వైద్యులు వేసుకునే కోటు, స్టెతస్కోప్ తో వైద్యురాలి వేషంలో దర్శనమిచ్చింది. ప్రియుడైతే నమ్మాడు కానీ, అక్కడున్న సెక్యూరిటీ గార్డులకు విషయం తెలుసుకదా... వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. అంతే అక్కడున్న వారికి ఆర్డర్లు ఇస్తూ హడావుడి చేస్తున్న అమ్మగారిని కటాకటాల వెనక్కి పంపారు పోలీసులు. పాపం ప్రేమా పోయింది, ఉద్యోగం ఊడింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ